నవతెలంగాణ - హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, ముంబై మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన ఈమెయిల్ కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బృందాలు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది నకిలీ బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. ఇటీవల ముంబైలో ఇలాంటి బెదిరింపు ఈమెయిళ్లు వరుసగా వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజా ఘటనపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుజాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)