Magazines

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్‌..

2 గంటల క్రితం

Indiramma Towers flat for just Rs 3.50 lakh..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో క్యూర్‌ పరిధి మినహా మిగతా కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లను లబ్ధిదారులకు రూ.3.50 లక్షలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో నిజామాబాద్‌ జిల్లా నాగారం, వరంగల్‌ పరిధిలోని గొర్రెకుంట, మడికొండ, నల్గొండలోని మామిళ్లగూడ, మహబూబ్‌నగర్‌లోని బండమీదిపల్లిలో 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్‌ 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండి, సంబంధిత కార్పొరేషన్‌ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో రూ.100 రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్