Magazines

‘ఇడుపు కాయితం’ నుంచి మరో పాట విడుదల

6 గంటల క్రితం

Another song released from ‘Idupu Kayitam’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నటుడు ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘ఇడుపు కాయితం’ నుంచి ‘బరాత్ బీట్’ పేరుతో కొత్త మాస్ పాట విడుదలైంది. పెళ్లి సందడి నేపథ్యంలో సాగే ఈ పాటలో నాగదుర్గ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’ పాటలకు మంచి స్పందన లభించింది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అభినవ్ గోమఠం, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్