Magazines

ఆనకట్టలో పడిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

3 గంటల క్రితం

Car falls into dam, four members of same family die
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : దీపావళి పండుగ రోజున ఛత్తీస్‌గఢ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గరియాబంద్‌ జిల్లా రాజిమ్‌లోని టిలా ఆనికట్‌ సమీపంలో ఆదివారం (నవంబర్‌ 8) కారు నదిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మృతులను శీతల్‌ సాహు, ఆయన భార్య భారతి, 19 ఏళ్ల కుమారుడు వికాస్‌, 21 ఏళ్ల కుమార్తె పూర్వగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నదిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వగ్రామంలో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు రాయ్‌పూర్‌ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో శీతల్‌ సాహు జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన కారుపై ‘మీడియా ఎగ్జిక్యూటివ్‌’ అని రాసి ఉంది. కారు ప్రమాదవశాత్తు నదిలో పడిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్