నవతెలంగాణ - హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన దాండియా వేడుకల ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాకేత్, పునీత్, నిశాంతి యాదవ్‌లను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు.
దాండియా ప్రమాదం.. ముగ్గురు అరెస్ట్
21 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)