నవతెంగాణ-హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియకు సాంకేతికంగా అంతరాయలు కలిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా వెలువరిస్తామని.. ఆ రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)