Magazines

ఇండోనేషియాలో భూకంపం..6.6 తీవ్రత

7 నిమిషాల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇండోనేషియాలోని తువాల్ నగరానికి పశ్చిమ-నైరుతి దిశలో 151 కిలోమీటర్ల దూరంలో బాండా సముద్రంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నవంబర్ 16న భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.41 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయని యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది. భూకంప కేంద్రం 68 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సునామీ ముప్పు లేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ బీఎంకేజీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్