Magazines

భద్రాచలం ప్రయివేట్ లాడ్జిలో ఘర్షణ...యువకుడు మృతి

23 నిమిషాల క్రితం

bhadrachalam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ భద్రాచలం: భద్రాచలం రామాలయ సమీపంలోని ఒక ప్రయివేట్ లాడ్జిలో రూమ్ కోసం వెళ్లిన యువకుడిపై లాడ్జి యజమాని,అతని అనుచరుడు విచక్షణారహితంగా దాడి చేయడంతో తెల్లం శరత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన తెల్లం శరత్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.సోమవారం రాత్రి సుమారు 10గంటల సమయంలో తన బంధువుల కోసం గది అద్దెకు తీసుకునేందుకు తన మిత్రుడితో కలిసి రామాలయ సమీపంలోని ఒకప్రయివేట్లాడ్జికి వెళ్లాడు.అక్కడ గది విషయమై లాడ్జి యజమాని,అతని అనుచరుడితో మాట్లాడుతుండగా ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన లాడ్జి యజమాని,అతని అనుచరుడు కలిసి శరత్,అతని మిత్రుడిపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.గమనించిన స్థానికులు వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విషయం తెలుసుకున్న మృతుడు శరత్ బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉండటంతో,వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు సంబంధిత లాడ్జి ఎదుట ఆందోళనకు దిగారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్