Magazines

రోడ్లు,భవనాల శాఖ మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే

20 నిమిషాల క్రితం

Dubbak MLA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ - తొగుట

దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రహదారుల అభివృద్ధి, నూతన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అవసరమైన రోడ్ల పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరినట్టు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్