Magazines

ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

24 అక్టోబర్, 2026

accident

accident

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట గ్రామం వద్ద రహదారి నిర్మాణ పనుల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, డ్రైవర్‌, ముగ్గురు కార్మికులు ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన టీచర్‌ సునీత పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను సునీత, మణి, నారాయణరావు, పవన్‌కుమార్‌తో పాటు ఓ డ్రైవర్‌గా గుర్తించారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్