నవతెలంగాణ - హైదరాబాద్ : హోమ్‌లోన్ పూర్తిగా చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ చౌహాన్ 1997లో తన సేల్‌డీడ్‌ను బ్యాంకులో డిపాజిట్ చేసి రుణం తీసుకున్నారు. 2019లో రుణాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ, ఆస్తి పత్రాలు కనిపించడం లేదంటూ బ్యాంకు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్.. వెంటనే సేల్‌డీడ్‌ను బాధితుడికి అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా రుణం పూర్తిగా చెల్లించిన తేదీ నుంచి ఆస్తి పత్రాలను తిరిగి ఇచ్చే వరకు రోజుకు రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎస్‌బీఐని ఆదేశించింది.






కామెంట్‌లు (0)