నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలో శుక్రవారం భారీ విమాన ప్రయాణ అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య తలెత్తడంతో అన్ని బయలుదేరే విమానాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ విధించింది. ఈ విషయాన్ని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ సోషల్ మీడియా వేదిక X ద్వారా వెల్లడించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన సాంకేతిక నిపుణులు దాని పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)