నవతెలంగాణ – హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గిలో మృతి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా వికారాబాద్ జిల్లా పరిగిలోని బహార్‌పేట్ చౌరస్తా వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. తన నివాసానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నరేందర్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఆయనను విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. పరిగిలో ఉద్రిక్తత
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)