Magazines

ఇరాన్ పై మళ్లీ దాడులు.. ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్

22 నిమిషాల క్రితం

Fresh attacks on Iran.. Netanyahu calls Trump..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఇజ్రాయిల్, అమెరికా దేశాల్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నెతన్యాహు, ట్రంప్ ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. వారి ఓటములకు ఇరాన్ దేశంపై అకారణంగా యుద్ధం కొనసాగించడమే. మధ్యంతర ఓటమిని జీర్ణించుకోలేని నెతన్యాహు ఇరాన్ పై యుద్ధం ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.


ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నారు. "యుద్ధాన్ని పునఃప్రారంభించాలని కోరుతూ నెతన్యాహు ఆయనకు ప్రతిరోజూ ఫోన్ చేస్తున్నారు. వైట్ హౌస్‌లోనూ, బయట కూడా యుద్ధం వద్దనుకునేవారు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు," అని ఈ చర్చల గురించి సమాచారం ఉన్న ఒక వ్యక్తి ఎఫ్‌టితో చెప్పారు. దౌత్య మార్గాలను అనుసరించి యుద్ధాన్ని ముగించాలని ప్రాంతీయ అరబ్ దేశాలు అమెరికా అధ్యక్షుడిని కోరుతున్న తరుణంలో ఈ దౌత్యపరమైన ఒత్తిడి వస్తోందని ఆ పత్రిక పేర్కొంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్