కుమ్మరి సంఘం మహబూబాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అలవాల శ్రీనివాస్
నవతెలంగాణ-నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల హడాక్ కమిటీ ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అలవాలా శ్రీనివాస్, జిల్లా హడాక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్, కో కన్వీనర్ సముద్రల సోమయ్య, కొత్తపల్లి రమేష్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నుకున్న నూతన కమిటీ మండల హడాక్ కమిటి కన్వీనర్ గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి గా పోతుగంటి శ్రీనివాస్, కమిటీ సభ్యులు గా పోతుగంటి రవి, వాడ్కాపురం నర్సయ్య, మల్యాల ఐలయ్య, రుద్రరాపు ఉప్పలయ్య, పాలాభిందేలా మహేష్ ల ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం సంఘం సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. తన ఎన్నికల సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మల్యాల నర్సయ్య, సముద్రల వెంకన్న, బొడ్డుపెల్లి వెంకన్న, అలవాలా శ్రీశైలం, కుమ్మర కులస్తులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)