Magazines

‘వీసీపీసీ’ కమిటీ ఎన్నిక

14 నిమిషాల క్రితం

VCPC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

సర్పంచులు పులి వెంకన్న, వీరన్న నాయక్, సూపర్వైజర్ ఎం సరిత

నవతెలంగాణ-​నెల్లికుదురు

మండల కేంద్రంతో పాటు దుర్గాభవాని తండా గ్రామ పంచాయతీలో వీసీపీసీ కమిటీని ఎన్నుకున్నట్లు సర్పంచులు పులి వెంకన్న, వీరన్న నాయక్, ఐసిడిఎస్ నెల్లికుదురు సెక్టర్ సూపర్వైజర్ సరిత తెలిపారు. మంగళవారం సెంటర్ లలో సమావేశాన్ని నిర్వహించి 15 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో పిల్లలపై జరిగే నేరాల నియంత్రణకు, చట్టాలపై అహగహన కల్పించడానికి కమిటీ దోహదపడుతుందని అన్నారు. 


బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, తదితర వివక్షను ఆపడానికి కమిటీ కృషి చేస్తుందని అన్నారు. కమిటీ చైర్మెన్‌గా సర్పంచ్  పులి వెంకన్న, కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్ ఎం.విజయను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంచాల వెంకన్న, స్కూల్ ఉపాధ్యాయుడు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి దేవయ్య , ఆశా రజిత, బాలల సంఘ సభ్యులు చందు, విపిఓ రాజారాం,  అంగన్‌శాడీ టీచర్లు పద్మ, కే పద్మ, టి.జ్యోతి, మాధవి పాల్గొన్నారు. అలాగే,  దుర్గ భవన తండా గ్రామపంచాయతీ కమిటీ చైర్మన్ గా వీరన్న నాయక్, కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ బి పద్మను ఎన్నుకున్నాఉ. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యశోద, ఆశా విజయ, బాలల సంఘ సభ్యులు కావ్య, వీఓ, అంగన్‌వాడీ టీచర్ సునిత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్