Magazines

మార్కెట్ కేంద్రాలను ప్రారంభించాలి

15 నిమిషాల క్రితం

Market centers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

రైతు సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న 

​నవతెలంగాణ-నెల్లికుదురు 

​గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో దళాల వ్యవస్థ కొనసాగుతుందని, తక్షణమే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం జిల్లా  అధ్యక్షుడు గునిగంటి రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదని అన్నారు. రైతుల పండించిన ధాన్యం ఇష్టం వచ్చినట్టుగా దళారులు మోసం చేస్తున్నారని తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


ఈనెల 15 నుంచి 18 వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే రైతు సంఘం ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఉచితంగా ఎరువులు, పురుగుమందులు అందించాలని, బ్యాంకు రుణాలు రద్దు చేసి కొత్త  రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు.  కార్యక్రమంలో  సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు, సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబుగౌడ్, నాయకులు తోట నరసయ్య, బాణాల యాకయ్య, బత్యం సత్యనారాయణ , బోడమంగ్య భూక్యా, భిక్షపతి, యాకయ్య, బండ వెంకన్న , తదితరులు పాల్గొన్నారు. 

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్