Magazines

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ రద్దుపై త్వరలో స్టడీ కమిటీ

3 గంటల క్రితం

Employess
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో సీపీఎస్‌ రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం త్వరలో స్టడీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఫైనాన్స్, సర్వీసు విభాగాల ఐఏఎస్‌ అధికారులు, సీపీఎస్‌ ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలుపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు, 2004 సెప్టెంబర్‌ 1కి ముందు నోటిఫికేషన్లు వచ్చి, ఆలస్యంగా నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్‌ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణలోనూ ఇలాంటి ఉద్యోగులు సుమారు 10 వేల మంది ఉన్నట్లు అంచనా. ఈ అంశంపైనా కమిటీ పరిశీలించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్