Magazines

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..మారనున్న బిల్డింగ్ రూల్స్..!

25 నిమిషాల క్రితం

telangana govrnment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సొంతింటి కల నెరవేర్చుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2012 నాటి భవన నిర్మాణ నిబంధనలను సవరించి, కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు మున్సిపల్ శాఖ ముసాయిదా సిద్ధం చేస్తోంది. చిన్న ప్లాట్ల అనుమతుల పరిమితిని 100 గజాలకు పెంచడం, సెట్‌బ్యాక్ నిబంధనల సడలింపు, 600 గజాలకే సెల్లార్ నిర్మాణానికి అవకాశం, పార్కింగ్ సదుపాయాల మెరుగుదల వంటి మార్పులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. బిల్డర్ల మార్టిగేజ్ నిబంధనలపైనా పునరాలోచన జరుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్