Magazines

హార్దిక్‌-అర్షదీప్ ట్రేడింగ్ పూర్తి

4 గంటల క్రితం

Hardik-Arshdeep trading completed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ముంబయి ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ఇచ్చి, బదులుగా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నట్లు లీగ్ బుధవారం ధ్రువీకరించింది. ముంబయి ఇండియన్స్‌కు ఎంపికైన పాండ్యా, 2022లో జట్టు నుంచి విడుదలయ్యాడు. అతని సారథ్యంలో ఆడిన 39 మ్యాచ్‌లలో ఎంఐ కేవలం 24 మాత్రమే గెలిచింది. 2019లో అర్షదీప్‌ IPLలో అరంగేట్రం చేసి 96 మ్యాచ్‌లలో 111 వికెట్లతో PBKS తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.


హార్దిక్‌ ఇప్పటివరకు 162 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. 2,955 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు. 146.28 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ముంబయిలో రూ.16.35 కోట్ల పారితోషికం అందుకున్న అతడు.. ఇప్పుడు రూ.18 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌లో చేరనున్నాడు. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఎనిమిది సీజన్ల పాటు పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. 2025 సీజన్‌లో 21 వికెట్లు తీయగా.. 2026లో 14 వికెట్లు సాధించాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంలో, చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంలో అతడు దిట్ట. ఇప్పుడు రూ.18 కోట్ల పారితోషికంతో ముంబయి జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్