Magazines

భారీగా విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత

21 అక్టోబర్, 2026

Huge seizure of foreign currency and gold

gold

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విజయవాడ శివార్లలో డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో భాగంగా భారీ విదేశీ బంగారం, కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో రూ.5.84కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలను అధికారులు గుర్తించారు. వీటిని బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. స్కార్పియోలో ఓ రహస్య అరలో బంగారం, 60వేల అమెరికన్‌ డాలర్లు, 21,500 యూరోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న బస్సులోని ముగ్గురు బంగారం క్యారియర్లును అరెస్టు చేశారు. వారు నడుముకు కట్టుకున్న పౌచ్‌లో ఉన్న 3.147 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్