Magazines

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డీల్‌.. సీఎస్‌కే, సన్‌రైజర్స్‌ మధ్య నలుగురు ప్లేయర్ల మార్పిడి

1 గంట క్రితం

Huge trade deal in IPL.. Four players exchanged between CSK and Sunrisers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – ముంబై: ఐపీఎల్‌ ప్లేయర్ల రిటెన్షన్‌ గడువు సమీపిస్తున్న వేళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌ కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు జట్లు నలుగురు ఆటగాళ్లను పరస్పరం మార్చుకున్నాయి. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఆస్ట్రేలియా బౌలర్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ సన్‌రైజర్స్‌ను వీడి సీఎస్‌కేలో చేరనున్నారు. మరోవైపు చెన్నై ఆటగాళ్లు ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎల్లిస్‌ వచ్చే సీజన్‌ నుంచి హైదరాబాద్‌ తరఫున ఆడనున్నారు. ఈ ట్రేడ్‌ డీల్‌ను ఐపీఎల్‌ అధికారికంగా ప్రకటించింది.


లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేయగా, ట్రేడ్‌ డీల్‌లో భాగంగా సుమారు రూ.7 కోట్ల తక్కువ ధరకే సీఎస్‌కేకు బదిలీ అయినట్లు సమాచారం. జాక్‌ ఎడ్వర్డ్స్‌ రూ.3 కోట్లకు చెన్నై జట్టులో చేరాడు. ఖలీల్‌ అహ్మద్‌ను రూ.4.8 కోట్లకు సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. గతంలో 2018 నుంచి 2021 వరకు హైదరాబాద్‌ తరఫున ఆడిన ఖలీల్‌.. 2025 సీజన్‌లో సీఎస్‌కే తరఫున 14 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్‌ నాథన్‌ ఎల్లిస్‌ రూ.2 కోట్లకు సన్‌రైజర్స్‌లో చేరాడు. ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ ద్వారా దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా పాండ్యా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్