నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగులకు అమెరికా హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విభాగంలో 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైపుణ్యాల లభ్యత, క్లయింట్ల అవసరాలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రభావితమైన ఉద్యోగులు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం కార్యాలయాల్లో కొనసాగవచ్చని లేదా 2026 చివరి నాటికి సంస్థ నుంచి వైదొలగవచ్చని సమాచారం. అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఐబీఎం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.







కామెంట్‌లు (0)