Magazines

ఐఐటి ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు..ప్రధాని హాజరు

2 గంటల క్రితం

IIT Kharagpur Platinum Jubilee celebrations... Prime Minister to attend
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పరిమిత ఆలోచనా విధానాల అడ్డంకులను ఛేదించి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి యువతకు పిలుపునిచ్చారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా, ఖరగ్‌పూర్‌లోని ఐఐటి ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో జరుగుతున్న ఐఐటి ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ప్రధాని విచ్చేశారు. కలైకుండ వైమానిక స్థావరంలో దిగి, రోడ్డు మార్గంలో ఐఐటి క్యాంపస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా.. వైద్య సదుపాయాల లభ్యతను మెరుగుపరచడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన అందుబాటు ధరల డీప్ మెడ్-టెక్ ఆవిష్కరణలు, లాస్ట్ మైల్ హెల్త్‌కేర్ పరిష్కారాలను ప్రధాని పరిశీలించారు. '75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్' చొరవ కింద 75 మంది విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. ఐఐటి ఖరగ్పూర్ 75 ఏళ్ల వార్షికోత్సవానికి గుర్తుగా ఒక స్మారక నాణేన్ని ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్