నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సత్తా చాటారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) అద్భుత శతకంతో చెలరేగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. దీంతో కివీస్‌పై 118 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో తన టెస్టు కెరీర్‌లో 13వ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ (80)తో కలిసి రెండో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే కైల్ జేమీసన్ బౌలింగ్‌లో పడిక్కల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి చేరువైన అతడు మూడో రోజు చివరి ఓవర్‌లో జాకబ్ డఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (55 నాటౌట్), నైట్ వాచ్‌మన్ అన్షుల్ కంబోజ్ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది.






కామెంట్‌లు (0)