Magazines

ఐపీఎల్‌ -2027 రిటెన్షన్‌ గడువు పొడిగింపు

1 గంట క్రితం

IPL-2027 retention period extended
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల రిటెన్షన్‌ ప్రక్రియకు సంబంధించి ఫ్రాంచైజీలకు విధించిన గడువును మరో రెండు రోజులు పొడిగించింది. ఈ మేరకు సోమవారం పది ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది. తొలుత నవంబర్‌ 15తో రిటెన్షన్‌ గడువు ముగియాల్సి ఉండగా, భారత్‌–న్యూజిలాండ్‌ మధ్య అదే రోజు ఐదో వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో నవంబర్‌ 17 వరకు పొడిగించింది. అంతర్జాతీయ మ్యాచ్‌ కారణంగా రిటెన్షన్‌ ప్రకటనలకు తగిన మీడియా ప్రాధాన్యం లభించకపోవచ్చనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు, ఐపీఎల్‌ 2027 మినీ వేలాన్ని డిసెంబర్‌ 16న గోవాలో నిర్వహించనున్నారు. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నవంబర్‌ 23 వరకు కొనసాగనుంది. అదే రోజు భారత్‌–శ్రీలంక వన్డే మ్యాచ్‌ ఉన్నప్పటికీ వేలం తేదీలో మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టం చేసింది.ప్రస్తుత సైకిల్‌లో ఇదే చివరి మినీ వేలం కానుండగా, 2028 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఇదిలా ఉండగా, వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య కీలక ట్రేడింగ్‌లు జరిగాయి. లక్నో జట్టు నుంచి రిషభ్‌ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తిరిగి తీసుకోగా, నటరాజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్