Magazines

అనిల్‌ రావిపూడి ‘జనవరి 12 విడుదల’..వదినా మరదలు సాంగ్‌ రిలీజ్‌

2 గంటల క్రితం

diviki Diviki
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం



నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఈ సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ అంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రమిది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా పాటల సందడి మొదలైంది. తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. ‘డివికి డివికి..’ అంటూ సాగే వదినా మరదలి పాటలో కీర్తి సురేశ్, కృతిశెట్టి డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ‘మా హామీ నువ్వే.. శివగామీ నువ్వే..’ అని సాగే లిరిక్స్‌ అనంత్‌ శ్రీరామ్‌ రాయగా.. మధుప్రియ, హరిప్రియ ఆలపించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్