Magazines

విద్యాసాగర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

7 గంటల క్రితం

kcr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ నాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయం నుంచి విద్యాసాగర్‌తో తనకు ఉన్న ఉద్యమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “వరంగల్ కేంద్రంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యాసాగర్ మరణంతో తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది” అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వరంగల్ వేదికగా సాగిన పోరాటాల్లో, ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో ఆయన పోషించిన పాత్ర ఎనలేనిదని గుర్తుచేశారు.

అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి విద్యాసాగర్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆయన మరణం పార్టీకి, ఉద్యమకారులకు తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ కాలం నుంచి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నేత విద్యాసాగర్ మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్