నవతెలంగాణ హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. వాతావరణంలో సంభవిస్తున్న ఈ හఠాత్ మార్పుల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
20 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)