నవతెలంగాణ - హైదరాబాద్ : తూర్పు మధ్య- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. శనివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఈ నెల 26 ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉంది. తుపాను తర్వాత రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
23 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)