Magazines

టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ షమీ

42 నిమిషాల క్రితం

Mohammed Shami announces retirement from Test cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : టీమ్‌ఇండియా స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించాడు. అయితే వన్డే, టీ20 ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2013 నవంబరు 6న టెస్టుల్లో అరంగేట్రం చేసిన షమి.. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే రోజున వీడ్కోలు పలకడం విశేషం. తన టెస్టు కెరీర్‌లో 64 మ్యాచ్‌లు ఆడి 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జొహానెస్‌బర్గ్‌ టెస్టులో ఐదు వికెట్లు, ఆస్ట్రేలియాతో పెర్త్‌ టెస్టులో ఆరు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో పాటు జట్టులో అవకాశాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానని, తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని షమి భావోద్వేగ సందేశం ఇచ్చాడు. తెల్లబంతి క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్