Magazines

నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం

35 నిమిషాల క్రితం

Papikondala excursion begins today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : అర్నబ్‌ తుఫాను కారణంగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గత నెల 26న నిలిచిపోయిన బోటు సేవలను అధికారులు పునరుద్ధరించారు. ఏపీలోని పోలవరం జిల్లా గండిపోశమ్మ ఆలయం, పోచవరం కేంద్రాల నుంచి పర్యాటకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అంతకుముందు వరదల కారణంగా దాదాపు 74 రోజుల పాటు పాపికొండల యాత్ర నిలిచిపోయింది. తాజాగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో అధికారులు యాత్రకు అనుమతించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్