Magazines

ఆహార భద్రతను దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం

3 గంటల క్రితం

Modi government
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

పండిన పంటను కంపెనీలు, మిల్లర్లు దోచుకుంటున్నారు
కార్పొరేట్ల చేతుల్లోకి వ్యవసాయం వెళ్తే రైతులకే కాదు.. కూలీలకూ తీవ్ర నష్టం

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్​

​నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​దేశంలో ఆహార భద్రతను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది.. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అలా అయితే, వెళ్తే రైతులకే కాకుండా వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు కూడా తీవ్రంగా నష్టపోతారు’’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 15న నిర్వహించే బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికులు, కౌలుదారులు, శ్రామికవర్గ ప్రజలు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ​భారతదేశంలో 1936లో ఏర్పడిన కిసాన్ సభకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని వెంకట్‌ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధి నినాదంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ​ వ్యవసాయ రంగం జాతీయ జీడీపీలో 16 నుంచి 18 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, అంకెల్లో చూస్తే రూ.70 లక్షల కోట్ల నుంచి రూ.80 లక్షల కోట్ల వరకు ఆర్థిక విలువను అందిస్తోందని వెంకట్‌ తెలిపారు. అమెరికా, రష్యా తర్వాత అత్యధిక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశమని తెలిపారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలు, ఇతర విదేశీ, స్వదేశీ కంపెనీలు ఆహార ధాన్యాలను తమ గోదాముల్లో నిల్వ చేసుకొని మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయని విమర్శించారు. బియ్యం ధరలు పెరుగుతున్నా గోదాముల్లో ఉన్న మిగులు బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎందుకు పంపిణీ చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నాటకాలాడుతోందని విమర్శించారు.​ ప్రభుత్వం కనీస మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేసినప్పుడే రేషన్ వ్యవస్థ కొనసాగుతుందన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, అధ్యక్షులు కోప్పుల లింగస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు బో జ్జ చిన్న వెంకులు, గంధ మల్ల రాములు ఉన్నారు.

​భూ కేంద్రీకరణకు అడ్డుకట్ట వేయాలి

​దేశంలో సుమారు 40 కోట్ల ఎకరాల సాగు భూమి, 15 కోట్ల కమతాలు ఉన్నాయని వెంకట్‌ తెలిపారు. 15 నుంచి 20 ఏండ్లుగా భూ కేంద్రీకరణ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చేసే రైతులకు అండగా ఉండాల్సిన రైతుబంధు పథకం ప్రయోజనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీలకు కూడా అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


​ఉపాధి హామీకి 
రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

​ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ పథకం కాదని, అది ఒక చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పనుల కోసం అదనంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్