Magazines

ఈ నెల 14న తెలంగాణకు రాహుల్‌ గాంధీ, ఖర్గే

26 నిమిషాల క్రితం

Rahul Gandhi, Kharge to visit Telangana on 14th of this month
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ నెల 14న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగనున్న ‘భారత్‌ సమ్మిట్‌ 2026 – తెలంగాణ రైజింగ్‌’ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా 13న ప్రియాంక గాంధీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించనున్నారు. దేశాల మధ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్