నవతెలంగాణ-హైదరాబాద్ : ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా నెల, 3 లేదా 6 నెలలకోసారి విడతలవారీగా పొందేందుకు వీలుగా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)ను తీసుకొచ్చింది. దీనికి ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. మిగిలిన మొత్తంపై రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛందం మాత్రమే. మరోవైపు పీఎఫ్ ఖాతాలో కనీస నిల్వ పరిమితిని 25 నుంచి 10 శాతానికి తగ్గించారు. ఉపసంహరణ కోసం వేచిచూడాల్సిన గడువును 12 నెలల నుంచి 2 నెలలకు కుదించారు.
ఈపీఎఫ్‌లో కొత్త పథకం..చందాదారులకు భారీ గుడ్ న్యూస్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)