నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు న్యూజిలాండ్ 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ కెప్టెన్సీలో జట్టును ఎంపిక చేసింది. గాయాల సమస్యలతో బాధపడుతున్నప్పటికీ టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలకు చోటు కల్పించింది. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. పేసర్ జాకబ్ డఫీ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయాల కారణంగా బెన్ సియర్స్, జాక్ ఫౌల్క్స్, విల్ ఓ రూర్క్ జట్టులో చోటు దక్కించుకోలేదు. 2024లో భారత గడ్డపై భారత్‌ను 3-0తో ఓడించిన న్యూజిలాండ్ మరోసారి అదే ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకంగా మారనుంది.
జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్







కామెంట్‌లు (0)