Magazines

హిమాచల్ ప్రదేశ్‌లో CITU నేతృత్వంలో అవుట్‌సోర్స్ కార్మికుల ఆందోళన

1 గంట క్రితం

Outsourced workers' protest in Himachal Pradesh led by CITU
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో అవుట్‌సోర్స్ సేవల కింద పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన రోజువారీ కనీస వేతనం రూ.25 వేలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిమ్లాలో నిరసన చేపట్టారు. సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (CITU) నేతృత్వంలో అవుట్‌సోర్స్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోందని, పారిశ్రామిక సంస్థలకు కార్మిక అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


ఈ సందర్భంగా CITU హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు విజేందర్ మెహ్రా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మార్చిలో వివిధ వర్గాల కార్మికులకు రోజువారీ కనీస వేతనాలను రూ.25 పెంచుతున్నట్లు ప్రకటించిందని, ఈ సవరించిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉందని అన్నారు. అయితే నెలలు గడిచినా, ఈ పెంపును అమలు చేసే నోటిఫికేషన్ జారీ కాలేదని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్