నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా శనివారం హైటెక్ సిటీలో నిర్వహించనున్న గిగ్ వర్కర్ల ర్యాలీలో పాల్గొననున్నారు. అలాగే కీలకమైన భారత్ సమ్మిట్ సమావేశానికి కూడా హాజరుకానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.
హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)