నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో నేడు గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించనున్న ఈ ర్యాలీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సైబర్ టవర్స్ నుంచి HITEX మెటల్ చార్మినార్ మీదుగా HICC, నోవాటెల్ వరకు ఆంక్షలు ఉంటాయి.
కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను యశోద–వసంత సిటీ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
బొటానికల్ గార్డెన్ వెళ్లే వాహనాలను ఐకియా రోటరీ–మీనాక్షి–రోలింగ్ హిల్స్ మీదుగా పంపిస్తారు.
కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే వాహనాలను రాడిసన్–AIG–ఐకియా రోటరీ మీదుగా మళ్లిస్తారు.
టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వచ్చే వాహనాలను CII జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు.
ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.







కామెంట్లు (0)