నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో తెలంగాణ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 8 ప్రత్యేక బృందాలతో 9 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు చోట్ల అపరిశుభ్ర వంటగదులు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు.
ఎఫ్ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న రెండు సంస్థలను అధికారులు మూసివేశారు. సుమారు 135 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మరో నాలుగు సంస్థల ఎఫ్ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్సులను సస్పెండ్ చేయగా, నాలుగు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. లైసెన్సులు సస్పెండ్ చేసిన సంస్థలను స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.






కామెంట్‌లు (0)