Magazines

హైదరాబా‎ద్‌ సిటీలో వాన

3 గంటల క్రితం

hyd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి హైదరాబా‎ద్‌ సిటీలో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఉప్పల్ బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన రావడంతో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉప్పల్ మేడిపల్లి రూట్ లో కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.  మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోచారం మున్సిపాలిటీలోనూ వర్షం కురుస్తోంది. మేడిపల్లి నుంచి చెంగిచర్ల వరకు భారీ వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈసీఎల్, కుషాయిగూడ, నేరేడుమెట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు నీట మునిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో  వర్షం దంచికొడుతోంది. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ లోనూ వర్షం కురుస్తోంది. యూసుఫ్ గూడ, మధురానగర్ అమీర్ పేట్లోనూ వాన దంచికొడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్