Magazines

తొలి వన్డేకు వర్షం అంతరాయం.. నిలిచిపోయిన టాస్‌

1 గంట క్రితం

Rain interrupts first ODI, toss called off

Rain

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గిన అనంతరం టాస్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు 123 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 63 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్‌ 52 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 7 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా, ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. આ గణాంకాల ప్రకారం వన్డేల్లో భారత్‌దే పైచేయిగా ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్