నవతెలంగాణ - హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ఈ నెల 23న కొత్త ఇన్‌ఛార్జ్ సందీప్‌తో సమావేశం కావాలని ఏఐసీసీ సూచించింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని, క్రమశిక్షణ చర్యలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. అవినీతికి పాల్పడుతూ, ప్రజావసరాలను విస్మరించే పాలకులను తెలంగాణ ప్రజలు, చరిత్ర క్షమించరంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
భేటీపై సర్వత్రా ఉత్కంఠ
కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న రాజగోపాల్ రెడ్డితో భేటీ అవుతన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం వివరణ కోరుతుందా..? లేక పార్టీలో అంతర్గత సమన్వయం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారా..? అనే దానిపై నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 23న జరిగే సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






కామెంట్‌లు (0)