నవతెలంగాణ - హైదరాబాద్ : టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4న లక్నోలోని హోటల్ రమదాలో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన సుమారు 2,000 మంది అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం. అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తదితర ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఈ జంట వివాహ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 4న రింకూ సింగ్ పెళ్లి
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)