Magazines

ట్రంప్ టారిఫ్ షాక్.. రూ.184 లక్షల కోట్ల సంపద ఆవిరి

20 నిమిషాల క్రితం

Trump tariff shock: Rs 184 lakh crore in wealth wiped out
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 16 దేశాలపై కొత్తగా టారిఫ్‌లు ప్రతిపాదించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.184 లక్షల కోట్లు) సంపద ఆవిరైనట్లు సమాచారం. ముఖ్యంగా నాస్‌డాక్ సూచీ 4 శాతం మేర పడిపోయింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా, మెటా వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ల పతన ప్రభావంతో క్రిప్టో కరెన్సీ విలువలు సైతం తగ్గడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్