Magazines

సీఐటీయూ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలను నిలిపివేసిన మెటా

11 నిమిషాల క్రితం

Meta
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

పార్లమెంట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చినందుకే చర్యలు అప్పీళ్లను తిరస్కరించిన మెటా

ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ పేజీ కూడా సస్పెన్షన్‌

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్లమెంట్‌ మార్చ్‌కు సీఐటీయూ పిలుపునిచ్చిన నేపథ్యంలో మెటా సంస్థ సీఐటీయూ మూడు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలను నిలిపివేసింది. సీఐటీయూ కేంద్ర కమిటీతో పాటు ఢిల్లీ, హర్యానా రాష్ట్ర కమిటీలకు చెందిన పేజీలనూ సస్పెండ్‌ చేసింది. ఈ చర్యపై సీఐటీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేజీలను నిలిపివేయడంపై సీఐటీయూ మెటాకు అప్పీల్‌ చేసుకున్నప్పటికీ వాటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మెటా ఇండియాను నేరుగా సంప్రదించే అంశాన్ని సీఐటీయూ పరిశీలిస్తోంది. ఈ మూడు పేజీలలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారాన్ని సీఐటీయూ ప్రచారం చేసింది. ఈ ఏడాది ఉత్తర భారత రాష్ట్రాల్లో జరిగిన కార్మిక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల వివరాలను కూడా పోస్టు చేసింది. డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న పార్లమెంట్‌ మార్చ్‌కు సంబంధించిన ప్రచారం కూడా చేసింది. మరోవైపు నీట్‌ విద్యార్థుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ కూడా సస్పెన్షన్‌కు గురైంది. ఈ పేజీపై నిషేధం విధించిన అనంతరం కొత్తగా ప్రారంభించిన పేజీకి 80 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్