Magazines

రాజ్యాంగ, ఓటు హక్కులను కాపాడుకోవాలి

10 నిమిషాల క్రితం

We must safeguard our constitutional rights and the right to vote.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపు ఆపాలి

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా

ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో

‘మేరా షహర్- జంతర్ మంతర్’ ప్రదర్శన

నారాయణగూడ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్

వరకు విద్యార్థులతో ప్రదర్శన

నవతెలంగాణ-సిటీబ్యూరో

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ ుకుని రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను, ముఖ్యంగా ఓటు హక్కును కాపాడు కోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘మేరా షహర్- జంతర్ మంతర్’ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా నారాయణగూడ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలక మైన హక్కు అని అన్నారు. ప్రజల ఓటుతో ఏర్పడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత నిరంతరం చైతన్యంతో ఉండాలని సూచించారు. సర్‌ పేరుతో ఓట్ల తొలగింపును తక్షణమే ఆపాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుదాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం-ఓటు హక్కును పరిరక్షించు కుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, సహాయ కార్యదర్శులు ప్రవీణ్, అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు అశ్వక్, నాయకులు శ్రీకాంత్, సాయినాథ్, నవీన్, వర్ధన్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్