Magazines

వైద్య విద్యార్థులకు వసతులు కల్పించండి

16 నిమిషాల క్రితం

Provide facilities for medical students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు వైద్య విద్యార్థులకు అవసర మైన వసతులను కల్పించి సమస్యలను పరిష్క రించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ‌రాజనర్సింహ అధికారులను ఆదే శించారు. నిర్మాణాలకు అవసరమైతే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. వైద్యరంగంలో పెండింగ్‌‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ బుధవారం సచివాలయంలో ఉన్న తాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమా వేశంలో ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా ఆస్పత్రులను ప్రజలకు, మెడికల్, నర్సింగ్ కాలేజీలను, హాస్టళ్ల ను విద్యార్థులకు అందుబాటు లోకి తీసుకు రావాలని మంత్రి రాజనర్సింహ ఆదేశించారు.

ఆ నిర్మాణాలకు అవసరమైన నిధులను సమకూరుస్తామని సీఎం చెప్పారని తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆరోగ్యశ్రీ సీఈఓ హన్మంతు జెండగే కొండిబా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్