Magazines

డ్రగ్స్‌ తయారీదారులు, సరఫరాదారుల ఆట కట్టించాలి

9 నిమిషాల క్రితం

The activities of drug manufacturers and suppliers must be put to an end.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 2 నిమిషాల చదవడం


నషా ముక్త్‌ భారత్‌ రాజకీయ కార్యక్రమం కాదు.. : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

‌సినీహిరో వెంకటేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభం

యువతే దేశానికి అతిపెద్ద బలం : వెంకటేశ్‌

నవతెలంగాణ – అంబర్‌పేట

డ్రగ్స్‌ తయారీదారులు, సరఫరాదారుల ఆట కట్టించి దేశాన్ని డ్రగ్స్‌ రహిత భారత్‌గా తీర్చిదిద్దాలని, యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. నషా ముక్త్‌ భారత్‌ రాజకీయ కార్యక్రమం కాదని, 140 కోట్ల ప్రజల ఉద్యమమని తెలిపారు. డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌, డ్రగ్స్‌ రహిత భారత్‌ లక్ష్యంగా ఆయన నాయకత్వంలో చేపట్టిన మూడు రోజుల ‘నషా ముక్త్‌ భారత్‌ – హైదరాబాద్‌ వాక్స్‌’ పాదయాత్ర బుధవారం హైదరాబాద్‌ అంబర్‌పేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైంది. సినీ హీరో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ‌కేంద్రమంత్రి పాదయాత్రను ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సే నో టు డ్రగ్స్‌’ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. జాతీయ జెండా చేతబూనిన కిషన్‌రెడ్డి తిలక్‌నగర్‌, ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తా, హిందీ మహావిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజీ, ఇఫ్లూ మీదుగా ముషీరాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా

సినీ హీరో విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ యువతే దేశానికి అతిపెద్ద బలమని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాన్ని డ్రగ్స్‌ రహిత భారత్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ మన ఆర్థిక ప్రగతిని దెబ్బతీసేందుకు శత్రుదేశాలు మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నషా ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనకు ముందుగా నషా ముక్త్‌ తెలంగాణ కావాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, మాజీ కార్పొరేటర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్