Magazines

ప్రజా రవాణా బలోపేతమే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం

12 నిమిషాల క్రితం

public transport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజారవాణా వాటాను 60 శాతానికి పెంచాలి

మెట్రో విస్తరణతో పాటు బస్సులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంపై దృష్టి సారించాలి : ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ లండన్ సీటీవో శశి వర్మ

నవతెలంగాణ-సిటీబ్యూరో

నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యలను అధిగమించాలంటే ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ లండన్(టీఎఫ్‌ఎల్‌) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నగర రవాణా, మెట్రో) ఎన్వీఎస్ రెడ్డి బుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చాగోష్టి నిర్వహించారు. లండన్ అనుభవాల నుంచి హైదరాబాద్, ఇతర భారత నగరాలు నేర్చుకోవా ల్సిన అంశాలపై జరిగిన ఈ గోష్టిలో శశి వర్మ పలు కీలక సూచనలు చేశారు.

ఫ్లై ఓవర్లు తాత్కాలికమే.. ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ముఖ్యం

కేవలం రోడ్ల వైశాల్యం పెంచడం, ఫ్లైఓవర్ల నిర్మాణం ట్రాఫిక్ సమస్యకు కొంతవరకే పరిష్కారం చూపుతాయని శశి వర్మ తెలిపారు. మెట్రో రైల్ విస్తరణతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. చక్కటి, వెడల్పయిన ఫుట్‌పాత్‌లను నిర్మించి ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ కల్పిస్తేనే ప్రజలు సొంత వాహనాలు వదిలి ప్రజారవాణాకు మొగ్గు చూపుతారని తెలిపారు.

లండన్ తరహాలో ఏకీకృత వ్యవస్థ అవసరం

హైదరాబాద్‌లో ఒకప్పుడు 40 శాతానికి పైగా ఉన్న ప్రజారవాణా వాటా ప్రస్తుతం 28 శాతానికి పడిపోవడం ఆందోళనకరమని శశి వర్మ అన్నారు. దీనిని ముందుగా 40 శాతానికి, ఆ తర్వాత 60 శాతానికి పైగా పెంచకపోతే భవిష్య త్తులో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుందని హెచ్చరిం చారు. 2000లో లండన్‌లో 14 రవాణా సంస్థలను ఏకీకృతం చేసి ‘టీఎఫ్‌ఎల్’ ఏర్పాటు చేయడం, అధిక ప్రభుత్వ పెట్టుబడులు, ప్రయివేటు వాహనాల పై నియంత్రణ చర్యలు అక్కడి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాయని వివరించారు. నగరాల అభివృద్ధి తోనే దేశ, రాష్ట్ర సంపద పెరుగు తుందన్నారు. మూడు దశాబ్దాల కిందట తాను హైదరాబాద్‌లో పనిచేశానని, అప్పటితో పోలిస్తే నగరం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసిం చారు. ఈ గోష్టిలో సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ బి.అజిత్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ఉమ్టా ఎండీ జీవన్ బాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్